తమలపాకు ఆరోగ్యానికి అందించే మేలు: తమలపాకును సంస్కృతంలో నాగవల్లి అంటారు. మన సంప్రదాయంలో ఆధ్యాత్మికంగాను, శాస్త్రీయంగాను తమలపాకుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దైవారాధనలోనే కాకుండా సాంప్రదాయ వైద్యంలో ను తమలపాకుని ఎక్కువగా వాడతారు. తమలపాకు ఔషధం లాంటిది, అందుకే దీనిని మితంగా వాడాలి. సున్నం, వక్క లాంటి వాటితో చేర్చి తినడం వల్ల దానిలోని ఔషధ గుణాలు పూర్తిగా శరీరానికి అందవు.
పోషకాలు: తమలపాకులో విటమిన్ a ,c ఇంకా క్యాల్షియం, ఫోలిక్ ఆసిడ్, ఫైబర్ అధికమోతాదులో ఉంటాయి. తమలపాకు యాంటిఆక్సిడెంట్ గ పనిచేస్తుంది.
ప్రయోజనాలు:
- తమలపాకు రసం తరుచు తీసుకుంటుంటే ముఖంపైన మచ్చలు, మొటిమలు, ముడతలు తగ్గి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
- ప్రతిరోజు తమలపాకు, 10 gr మిరియాలు కలిపి తింటుంటే బరువు తగ్గుతారు.
- మోకాళ్లనొప్పులు త్వరగా తగ్గడానికి తమలపాకుని పేస్ట్ ల చేసి మోకాళ్లపై లేపనంగా రాయాలి. వాపులు, నొప్పులకు తమలపాకుని వేడిచేసి కట్టుకట్టాలి.
- తమలపాకుని పేస్ట్ ల చేసి తలకు పట్టించి 2-3 గంటల తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరుచు చేయడం వల్ల చుండ్రు పోతుంది.
- చిన్నపిల్లల్లో జలుబు ఎక్కువగా ఉన్నపుడు తమలపాకుని వేడిచేసి ఆముదంతో చేర్చి ఛాతీమీద ఉంచితే జలుబు తగ్గుతుంది.
- తమలపాకు పరగడుపున నమిలి మింగితే కిడ్నీ స్టోన్స్ తగ్గిపోతాయి.
- తమలపాకు రసంలో నిమ్మరసం చేర్చి పరగడుపున తాగితే షుగర్ కంట్రోల్ ఉంటుంది.
- తలపాకుని నేరుగా తీసుకోవడం వళ్ళ రక్తాన్ని శుద్ధిచేస్తుంది. రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది.
- మగవారిలో లైయింగిక సామర్ధ్యాన్ని పెంచుతుంది.
- చెవులపైనా తమలపాకులు కాసేపు ఉంచితే కఫము తగ్గి తలనొప్పి(మైగ్రేయిన్) తగ్గుతుంది.
- భోజనం తరువాత తమలపాకు తింటే ఉబ్బసం, ఊబకాయం ను తగ్గిస్తుంది.
- నేరుగా తమలపాకును నమిలి పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది, చిగుళ్ల నొప్పులు, చిగుళ్ల నుండి రక్త స్రావం లాంటివి తగ్గుతాయి.
- తమలపాకులో చెవికల్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో బాక్టీరియా పెరగడాన్ని అరికడుతుందని పరిశోధనలలో తేలింది.
గమనిక:
- అధిక తాంబూల సేవనం వల్ల `కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అధిక రక్తపోటు ఉన్నవారు తాంబూలాన్ని తగ్గించాలి.
- తొడిమతో తినడం వళ్ళ స్త్రీలలో వందత్వం వస్తుంది.అంటే పిల్లలు పుట్టరు. అందువల్ల సంతానం కావాలనుకునేవారు తొడిమ తీసి తినాలి.