వాము తో అద్భుత ప్రయోజనాలు

July 16, 2019

చాల ఔషదాలు వంటింట్లో దినుసుల రూపంలో లభిస్తాయి. అందులో ఒకటి వాము. దీనినే “వోమ” అంటారు. ఇది కఫాన్ని హరిస్తుంది. యాంటీ బాక్టీరియల్ గుణాలని కలిగి ఉంటుంది.

  1. వాము జీర్ణశక్తిని పెంచుతుంది.
  2. తిన్న ఆహారం జీర్ణం కానపుడు వేడినీటిలో వాము చేర్చి త్రాగితే మంచి ఫలితం ఉంటుంది.
  3. వాము తో కషాయం జ్వరానికి మంచి మెడిసిన్.
  4. ఇవి వికారాన్ని తగ్గిస్తుంది. వాంతులు తగ్గడానికి ఉపకరిస్తుంది.
  5. చిన్న పిల్లల్లో జలుబు, దగ్గు లాంటి సమస్యలకువాముని వేయించి కాస్త నలిపి వాసనా చూపించడం వల్లమంచి ఫలితం ఉంటుంది. అందుకే వాముని ఒక గుడ్డలో చిన్న చిన్న ఉండలుగా కట్టి చిన్న పిల్లల మెడలో కడతారు. జలుబు, దగ్గు కి ఇది ఒక మంచి రెమెడి.