అనేక ఔషధ గుణాలకు నిలయం అశ్వగంధ(కింగ్ అఫ్ ఆయుర్వేద)

June 25, 2019

అశ్వగంధ కి సంస్కృతంలో వారాహి కర్ణ, బలదా, తెలుగులో పెన్నేరు గడ్డ అని పేరు. పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డ అని పెద్దలు చెప్తారు. అంతుచిక్కని వ్యాధులకు అశ్వగంధ ని మందుగా వాడుతారు. అలోపతి వైద్యంలో పెన్సులిన్ ఎలాగో ఆయుర్వేదంలో అశ్వగంధ అలాగే. అందుకే అశ్వగంధ ని “కింగ్ అఫ్ ఆయుర్వేద” అంటారు. యాంటీ బాక్టీరియల్, యాంటీ డిప్రెసెంట్ గుణాలను కలిగి ఉంటుంది. అశ్వగంధ ఆకుల దగ్గర నుండి వేరు వరకు అన్ని ఉపయోగకరమైనవే. అశ్వగంధ పొడిని దాని వేరు ని ఎండబెట్టి సేకరిస్తారు.

ప్రయోజనాలు:

 1. జ్ఞాపకశక్తిని పెంచే అత్యంత శక్తివంతమైన ఔషధం అశ్వగంధ.
 2. పురుషులలో లైయింగిక సామర్ధ్యాన్ని పెంచుతుంది. వీర్యకణాల వృద్ధికి బాగా ఉపయోగపడుతుంది.
 3. అధిక రక్తస్రావం, తెల్లబట్ట, సమస్యలకు మంచి మందు. సంతానోత్పత్తికి మంచి మందుగా ఉపకరిస్తుంది. గర్భవతులకు, బాలింతలకు బలాన్ని చేకూర్చి, పాల వృద్ధినిస్తుంది.
 4. నేత్ర సంబంధ వ్యాధులకు మంచి ఫలితాన్నిస్తుంది. దానికిగాను అశ్వగంధ, అతిమధురం, త్రిఫల చూర్ణం సమపాళ్లలో కలిపి రోజు 2 పూటలా తీసుకోవాలి.
 5. అశ్వగంధ చూర్ణం కి నెయ్యి కలిపి ఫంగస్, తామరపైన రాస్తూ, పాలతో అశ్వగంధ ను కలిపి లోపలికి తీసుకోవడం వల్ల మంచి గుణం కనిపిస్తుంది. దీని వల్ల చర్మరోగాలు చాలావరకు తగ్గిపోతాయి.
 6. ఎముకలకు బలాన్నిచేకురుస్తుంది. దంతక్షయాన్ని నివారిస్తుంది. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. కొత్త కణాల వృద్ధికి ఉపయోగపడుతుంది.
 7. నాడీ సంబంధ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. నిద్రలేమి సమస్యను నివారిస్తుంది. డిప్రెషన్ ని తగ్గిస్తుంది.
 8. రక్తపోటు, మధుమేహంను కంట్రోల్లో ఉంచుతుంది. ఊబకాయం, అల్సర్లకు మంచి మెడిసిన్.
 9. కండ పుష్టికి, నరాల బలహీనతకు, ఒత్తిడిని నివారించడంలో మంచి ఫలితాలనిస్తుంది. క్షయ వ్యాధి, ఫుల్లు, గడ్డలు తగ్గించడానికి వాడుతారు.
 10. కాన్సర్ ట్రీట్మెంట్ లో సపోర్టింగ్ మెడిసిన్ గ వాడుతారు. దీనివల్ల రేడియేషన్ ప్రభావం శరీరంపై ఎక్కువగా లేకుండా చూస్తుంది. శరీరాన్ని ఎక్కువగా బలహీనపడకుండా చూస్తుంది.

గమనిక:

 1. అశ్వగంధ ని ఎక్కువకాలం వాడితే గుండెపైన, అడ్రినల్ గ్రంధులపైనా చెడుప్రభావం చూపిస్తుంది.
  అంతేకాకుండా థైరాయిడ్ గ్రంధి ఉతేజం పొంది హైపర్ థైరాయిడ్ వచ్చే ప్రమాదం ఉంది.