అద్భుత ఔషదాల గణి అలోవెరా (కలబంద):

April 11, 2019

అలోవెరా గ అందరికి తెలిసిన మొక్క కలబంద. సంస్కృతంలో “కుమారి” అంటారు. వేళ సంవత్సరాల నుండి ఆయుర్వేదంలో కలబందను వాడుతున్నారు. చాల రకాల కాస్మొటిక్స్ లో, హెయిర్ ఆయిల్స్ లో, షాంపూస్ లో వీటిని చాల ఎక్కువగా వాడుతున్నారు. అందుకే దీనికి డిమాండ్ చాల ఎక్కువ.

పోషకాలు:-ఎ , బి, బి 12, సి, ఇ విటమిన్లు ఉంటాయి. వీటిలో ఎంజైములు, మినరల్స్, 22రకాల ఎమినో ఆసిడ్స్ ఉంటాయి. ఇంకా ఇందులో 99.3% నీరు ఉంటుంది.

లాభాలు:-

  1. కలబంద గుజ్జును రోజ్ వాటర్ తో కలిపి శరీరానికి పూస్తే శరీరంలో మృతకణాలుపోతాయి.
  2. దంతక్షయానికి కారణం అయ్యే బాక్టీరియాను నిర్మూలిస్తుంది. అందుకే చాల రకాల టూత్పేస్ట్ లలో కలబందను వాడుతారు.
  3. కలబంద గుజ్జులో నిమ్మరసం కలిపి తలకి పట్టించి 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. కలబంద గుజ్జుతో హెయిర్ ఆయిల్ తయారుచేసి వాడటం వళ్ళ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, చుండ్రు పోతుంది, తలలో పేళ్లు కూడా పోతాయి.
  4. సోరియాసిస్ లాంటి నివారణ లేనటువంటి వ్యాధులకు కలబంద మంచి మందుగా ఉపకరిస్తుంది. కలబంద రసం లో కానుగ నూనెను కలిపి ఒంటికి పట్టించి 2, 3 గంటల తరువాత స్నానం చేయాలి.
  5. కలబంద జ్యూస్ డయాబెటిస్, అల్సర్, బరువు తగ్గడంలో ఉపకరిస్తుంది. లైంగిక పటుత్వాన్ని పెంచడంలో కూడా దీనిని వాడుతారు.
  6. గుండె, కిడ్నీ, హెపటైటిస్ బి, కాన్సర్, వాపులు, కీళ్లనొప్పులు ఇలాంటి చాల వ్యాధుల చికిత్సలో కలబందను వాడుతారు.
  7. కలబంద గుజ్జులో పసుపు కలిపి ముఖానికి పట్టించడం వల్ల చర్మం బిగుతుగా తయారవుతుంది. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, ముడతలు, మచ్చలు, ప్రెగ్నెన్సీ తరువాత వచ్చే స్ట్రెచ్ మార్క్స్ పోతాయి.
  8. కలబందరసంలో శొంఠిపొడి కలిపి తీసుకోవడం వల్ల ఎక్కిళ్ళు వెంటనే తగ్గిపోతాయి.
  9. కాలిన గాయాలపై కలబంద గుజ్జును పూస్తే మంట తగ్గిపోతుంది. గాయాలకు సంబందించిన మచ్చలు కూడా లేకుండా చేస్తుంది.
  10. ఆవుపాలలో 2 స్పూన్ల కలబంద రసం, పటికబెల్లం కలిపి తీసుకోవడం వల్ల గర్భాశయ సమస్యలు తగ్గిపోతాయి, మూత్ర సంబందిత సమస్యలు తొలగిపోతాయి.

గమనిక:-

  1. గర్భిణీ స్త్రీలు కలబంద తీసుకోకూడదు.ఎందుకంటె అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది.
  2. బాలింతలు కూడా కలబంద తీసుకోకూడదు. పిల్లలకు విరేచనాలు అవుతాయి.