ప్రపంచంలోనే అత్యధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థం – బాదం

August 30, 2019

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నోరకాల పోషకాలు అవసరం. వేలకొద్దీ ఆహారపదార్థాలలో ఎక్కువ మేలు చేసేవి ఏవో తెలియవు. అందుకే ఇటీవల కొందరు శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనాల ఆధారంగా అత్యుత్తమ ఆహార పదార్థాలకు ర్యాంకులు ఇవ్వడం జరిగింది.

శాస్త్రవేత్తల అధ్యనాల ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక పోషకాలు కలిగిన ఆహారపదార్థం బాదం. అందువల్లనే బాదం కి మొదటి ర్యాంకు ఇవ్వడం జరిగింది. 100 గ్రాముల బాదం లో 579 కి.క్యాలరీల శక్తి ఉంటుంది.

పోషకాలు: బాదంలో విటమిన్ E, B12 తో పాటు మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, జింక్, పొటాషియం, పాస్పరస్, ఐరన్, సిలీనియం, ఫైబర్ ఉంటాయి. వీటితోపాటు ఒమేగా3ఫ్యాటీయాసిడ్స్, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీయాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటుంది.

ప్రయోజనాలు:

  1. నాడీ వ్యవస్థని పటిష్టం చేస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది.
  2. జనన సమయంలో ఏ లోపాలు ఉండకూడదంటే గర్భిణీ స్త్రీలు బాదం పప్పు తినాలి.
  3. రక్త హీనత సమస్యని అధిగమించవచ్చు. దంతాలను, ఎముకల్ని ధృడంగా చేస్తుంది
  4. బాదం, తేనె కలిపి తీసుకోవడం వల్ల మగవారిలో లైంగిక సామర్ధ్యాన్ని పెంచుతుంది.
  5. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
  6. చేడు కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది, మంచి కొలస్ట్రాల్ ని పెంచుతుంది. గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది.
  7. అతి ఆకలిని తగ్గిస్తుంది, అధిక బరువుని తగ్గిస్తుంది.
  8. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది.
  9. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.
  10. పెద్దపేగు కాన్సర్ రాకుండా నివారిస్తుంది.