మామిడి పళ్ళ వలన లాభాలు, నష్టాలు

May 27, 2019

వేసవి వచ్చిందంటే అందరికి గుర్తొచ్చేది మామిడి పళ్ళు. చిన్న పెద్ద అందరూ ఎదురు చూసేది మామిడిపళ్లకోసం. రసాలు, బంగినపల్లి, అల్ఫాన్సా, కేసరి, తోతాపురి లాంటి వందకు పైగా రకాలు మార్కెట్ లో దొరుకుతున్నాయి.

అన్ని పండ్లలో కంటే మామిడి పండ్లలో చక్కర శాతం ఎక్కువగా ఉంటుంది. చెక్కర తో పాటు పీచు పదార్థాలు, ఐరన్, కాల్షియం, పిండిపదార్థాలు, జింకు, మెగ్నీషియం, పాస్పరస్, చాల రకాల విటమిన్స్, ఖనిజ లవణాలను కలిగి ఉంటుంది. రుచిలోకూడా మామిడి పండ్లను మించినది మరొకటి లేదు అయితే ఇన్ని పోషక విలువలు ఈ మామిడి పండ్లు ఇపుడు అందర్నీ భయపెడుతున్నాయి ఎందుకంటే ఈ మామిడి పండ్లను సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా కార్బైడ్ వంటి వివిధ రసాయాలను ఉపయోగించి మగ్గపెడుతున్నారు.

కార్బైడ్ ఉపయోగించి మగ్గపెట్టడం వలన కలిగే నష్టాలు:

  1. కాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
  2. బ్రెయిన్ సెల్స్ ను డామేజ్ చేస్తుంది.
  3. అమ్మాయిలలో PCO Problems, Obesity.
  4. గర్భస్థ శిశువులకు హానికరం.
  5. ఈ రసాయనాల వల్ల Psychological Problems పెరిగే అవకాశం వుంది.

కార్బైడ్ వంటి రసాయనాలతో పండించిన పండ్లను గుర్తించడం:

  1. సాంప్రదాయ పద్దతులతో మగ్గించిన పండ్లకు మంచి రంగు ఉండదు. కార్బైడ్ స్ప్రే చేసిన పండ్లకు మంచి రంగు ఉంటుంది.
  2. మాములు పండ్లు నొక్కితే మెత్తగా ఉంటాయి, కాని రసాయనాలతో మగ్గించిన పండ్లు గట్టిగా ఉంటాయి.
  3. సాంప్రదాయ పద్దతులతో మగ్గించిన పండ్లకు మంచి వాసన ఉంటుంది, కాని కార్బైడ్ మగ్గించిన పండ్లుకు మంచి వాసన ఉండదు.
  4. మాములు పండ్లు కట్ చేస్తే రసం వస్తుంది , రసాయనాలతో మగ్గించిన పండ్లులో రసం సరిగా ఉండదు.
  5. సాంప్రదాయ పద్దతులతో మగ్గించిన పండ్లు నీటిలో వేస్తే మునుగుతాయి, కృత్రిమంగా మగ్గించిన పండ్లు నీటిలో తేలుతాయి.