లీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం?

June 21, 2019

లీచీ పండు చూడటానికి ఎరుపు రంగులో ఆకర్షణీయంగా ఉంటుంది. రుచికి కూడా బావుంటుంది. లీచీ జన్మస్థలం చైనా. అయినా ఇప్పుడు అన్నిచోట్లా విరివిగా దొరుకుతున్నాయి. మన దేశంలో బీహార్ లో ఎక్కువగా సాగుచేస్తారు. ఇది మంచి సువాసనను కలిగిఉంటుంది. కానీ ఎక్కువ రోజులు నిల్వచేస్తే ఇది ఆ సువాసనను కోల్పోతుంది. కనుక అందరు వీటిని తాజాగానే తీసుకుంటారు. ఇది భోజనం తరువాత తినేటువంటి పండ్లలో ఒకటి.

పోషకాలు : లీచీ పండులో c విటమిన్ అధికంగా కలిగిఉంటుంది. సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఇంకా కాపర్, మాంగనీస్, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ ఉంటాయి.ఈ లీచీ పండ్లు యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగిఉంటుంది.

ప్రయోజనాలు :

  1. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  2. జీర్ణ ప్రక్రియ సవ్యంగా జరిగేలా చేస్తుంది. మలబద్దక సమస్యను నివారిస్తుంది.
  3. శరీరం పోషకాలను ఎక్కువగా గ్రహించేలా చేస్తుంది.
  4. వీటిలో ఉండే ఐరన్ ఎర్రరక్తకణాలను వృద్ధి చేస్తుంది.
  5. ఎముకలను దృడంగా చేస్తుంది.
  6. వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా, బాక్టీరియాల దాడి నుండి రక్షిస్తూ యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గ పనిచేస్తుంది.
  7. రక్తపోటును కంట్రోల్ లో ఉంచుతుంది, గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది.
  8. చర్మంపై ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
  9. తెల్లరక్తకణాల పనితీరుని మెరుగుపరుస్తుంది.
  10. అధిక బరువును తగ్గిస్తుంది.

లీచీ పండులో దాగిఉన్న ప్రమాదం:

ఈ పండ్లు మే, జూన్ మాసాలలో ఎక్కువగా లభిస్తాయి. వీటిని బీహార్ లోని ముజాఫర్ పూర్ అనే గ్రామంలో ఎక్కువగా సాగుచేస్తారు. అయితే అక్కడ చాలామంది పిల్లలు ఒక విచిత్రమైన వ్యాధి సోకడం వల్ల చనిపోయేవారు. ఈ వ్యాధితో బాధపడే 199 మంది పిల్లల మీద చేసే పరిశోధనల్లో తేలింది ఏంటి అంటే ఇక్కడ లీచీ ఎక్కువగా పండుతుంది కనుక పిల్లలు కాళీ కడుపుతో వీటిని ఎక్కువగా తినడం వల్ల హైసొగ్లయిసిమిక్ ఇంసోఫాలోపతి అనే నరాల సంబంధ వ్యాధి సోకి ఫిట్స్ తో బాధపడి చనిపోతున్నారు. అబ్సర్వేషన్లో ఉన్న 199 మంది పిల్లల్లో 122 మంది చనిపోయారు. మిగిలినవారు ఇప్పటికి కూడా ఫిట్స్ తో బాదపతున్నారు. అందువల్ల పరగడుపున గాని,షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నపుడు గాని ఈ పండ్లను తీసుకోకూడదు. దీనిని మరీ ప్రమాదకరమైన కిల్లర్ ఫ్రూట్ గా చూడకుండా మితంగా తిని వీటి వల్ల కలిగే ప్రయోజనాలు పూర్తిగా పొందండి.