మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయవల్సిన, చేయకూడని పనులేంటి ?

October 2, 2019

మన శరీరంలోని వ్యర్దాలని బయటికి పంపించేయడం అనేది మూత్రపిండాల యొక్క ముఖ్య విధి. శరీరంలో పేరుకుపోయిన వ్యర్దాలను, టాక్సిన్స్ ఎప్పటికప్పుడు వడపోసి యూరిన్ ద్వారా బయటకి పంపిస్తుంది. మూత్ర పిండాల పనితీరు సరిగా ఉన్నంతకాలం ఏ సమస్య ఉండదు. కానీ వీటి ఆరోగ్యం చెడితే మాత్రం చాలారకాల అనారోగ్యాలు వస్తాయి. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నీరు ఎక్కువగా తాగితే సరిపోతుందని చాల మంది అభిప్రాయం. కానీ అది మాత్రమే సరిపోదు. చాల జాగ్రత్తలు పాటించాలి. అందులో మూత్రపిండాల ఆరోగ్యం సరిగా లేనివారైతే వీటిని కచ్చితంగా పాటించాలి.

చేయకూడని పనులు:

 1. మద్యపానం, ధూమపానం చేయకూడదు.
 2. మటన్, రెడ్ మీట్ తీసుకోకూడదు.
 3. ఉప్పు వాడకం తగ్గించాలి. ఉప్పు మూత్రపిండాల పనితీరుపై ఒత్తిడి కలిగిస్తుంది.
 4. ఎక్కువగా ప్రోటీన్స్ కలిగిన ఫుడ్, కొవ్వు ఎక్కువగా ఉన్న ఫుడ్, ఆయిల్ లో వేయించిన పదార్థాలని తీసుకోకూడదు.
 5. షుగర్ తక్కువగా తీసుకోవాలి. అధిక శాతం షుగర్ ఉన్న పదార్థాలని, పానీయాలని తగ్గించడం మంచిది.
 6. యూరిన్ ఎక్కువగా ఆపుకోకూడదు. దీని వల్ల మూత్రపిండాలలో రాళ్ళూ వచ్చే ప్రమాదం ఉంది.
 7. టమాటో, పాలకూర ను తీసుకోకూడదు.
 8. యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ ని వాడకూడదు.
 9. కాఫీ, టీ లను తగ్గించడం మంచిది.
 10. మైక్రోవేవ్ ఫుడ్స్ తక్కువగా తీసుకోవాలి. చంటి పిల్లలకు అస్సలు ఇవ్వకూడదు.

చేయవల్సిన పనులు:

 1. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. లేకపోతే శరీరం నుండి టాక్సిన్స్ బయటికి పోకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
 2. తగినంత నిద్ర అవసరం. బాడీ రిలాక్స్ అవడానికి, తిరిగి శక్తిని పుంజుకోవడానికి విశ్రాంతి చాల అవసరం.
 3. విటమిన్ B6, మెగ్నీషియం కలిగి ఉన్న తాజా కూరగాయలు, పండ్లు రెగ్యులర్ డైట్ లో ఉండేలా చూసుకోవాలి.
 4. పసుపు, అల్లం ప్రతీరోజు మన తినే ఆహారపాదార్థాలలో ఉండేలా చూసుకోవాలి.
 5. బెర్రీస్, పూల్ మఖాన, బ్లాక్ బీన్స్, నువ్వులు, ఆలివ్ ఆయిల్, కొత్తిమీర, పెరుగు, మస్టర్డ్ గ్రీన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.