ఉసిరి (The Indian gooseberry) వల్ల కలిగే ప్రయోజనాలు.

April 3, 2019

ఉసిరి: చలికాలంలో ఎక్కువగా దొరికేది, అనేక ఆయుర్వేద లక్షణాలు, ఔషధ గుణాలు కలిగినదే ఉసిరి. దీనిని ఆరోగ్యం కోసమే కాకుండా, కార్తీకమాస దీపారాధనలో వాడుతారు. రుచికి పుల్లగా, వగరుగా ఉండే ఉసిరి వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు.

indian gooseberry health benefits

పోషకాలు :

ఉసిరి ఆకుల దగ్గర నుండి బెరడు వరకు అన్ని ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఉసిరి లో “విటమిన్ సి” ఎక్కువగా ఉంటుంది. దీనిలో కాల్షియం, పాస్పరస్, ఐరన్ ఇంకా ఫైబర్ ఉంటుంది. వీటిలో తక్కువ కాలరీలు ఎక్కువ పోషకాలుంటాయి. ఉసిరి యాంటీ బయోటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది.

లాభాలు:

  1. వాత, పిత్త, కఫ రోగాలను నయం చేయడం లో ఉసిరి పొడిని వాడతారు.
  2. తేనెలో నానబెట్టిన ఉసిరిని తీసుకోవడం వాళ్ళ జాండిస్ ను నివారిస్తుంది. లివర్ ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. ఆస్తమా వంటి వ్యాధులను అరికడుతుంది.
  3. స్త్రీలలో ఋతు సంబంధ సమస్యలు తగ్గుతాయి. పురుషులలో  వీర్యం నాణ్యత పెరుగుతుంది.
  4. పడుకునే ముందు చెంచా ఉసిరి పొడిని తేనెతో కలిపి తీసుకుంటే గ్యాస్, ఎసిడిటి, మలబద్దకం, పైల్స్ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
  5. వృద్ధాప్య ఛాయలు తొందరగా రాకుండా యవ్వనంగా కనిపించేలా చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. జుట్టుని ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. గోళ్లు పెళుసుబారకుండా చేస్తుంది.
  6. ఉసిరి జ్యుస్ తీసుకోవడం వల్ల యూరినరీ, డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ ను తగ్గిస్తుంది.
  7. ఆమ్లా కాండీస్ తయారుచేసుకుని తినడం వల్ల జీర్ణ శక్తిని పెంచుతుంది. నోటి వికారతను, మౌత్ అల్సర్స్ ను తగ్గిస్తుంది.
  8. శరీరం లో ఏర్పడే ప్రిరాడికల్స్, టాక్సిన్స్ ను బయటికి పంపిస్తుంది. గుండె జబ్బులను అరికడుతుంది.
  9. బరువు నియంత్రణలో,వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో ఉపకరిస్తుంది.
  10. కంటి చూపును మెరుగుపరుస్తుంది. రక్తహీనత సమస్యను అరికడుతుంది.